వెంకటేష్ కూతురు ఆశ్రిత వెడ్డింగ్ రిసెప్షన్ వెన్యూ వివరాలు ఇవే..
విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డితో మార్చి 24న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ, కొందరు సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
కాగా.. వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం (మార్చి 28)న హైదరాబాద్‌లో జరుగబోతోంది. గచ్చిబౌలిలోని అన్వయా కన్వన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు.
హీరో వెంకటేష్ కూతురు వెడ్డింగ్.. (ఫొటోలు)

కాగా... ఆశ్రిత పెళ్లాడిన వినాయక్ రెడ్డి కుటుంబం విషయానికొస్తే... వినాయక్ రెడ్డి తాత రామసహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఆశ్రిత ప్రొఫెషనల్ బేకర్, ఫుడ్ బ్లాగర్. పెళ్లి తర్వాత కూడా ఆమె దీన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











