»   » వెంకీ 'దృశ్యమ్‌' ఫస్ట్ లుక్ (ఫొటో), రిలీజ్ డేట్

వెంకీ 'దృశ్యమ్‌' ఫస్ట్ లుక్ (ఫొటో), రిలీజ్ డేట్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : వెంకటేష్‌ మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన 'దృశ్యమ్‌' సినిమాని తెలుగులో వెంకటేష్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ దగ్గరలోని అరుకులో జరుగుతోంది. వెంకేటేష్, మీనా, చలపతిరావు, రవికాలే మొదలైన వారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలోదే మీరు చూస్తున్న ఫోటో. అలాగే ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయటానికి నిర్ణయించారు. మేజర్ పార్ట్ ని వైజాగ్ రూరల్ ఏరియాలో పూర్తి చేయనున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

    Venkatesh's Drushyam to release on Aug 15

    మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.


    వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

    నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

    English summary
    Venkatesh's Malayalam Super Hit Remake, Drushyam will release on August 15. The film is now progressing in Araku, Vizag District. Venky, Meena, Ravi Kale, Chalapathi Rao and etc., are participating in ongoing schedule.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more