'నాగవల్లి'లో వెంకటేష్ ద్విపాత్రాభినయం
ఇందులో నేను సైకియాట్రిస్ట్‌గా, రాజుగా రెండు పాత్రల్లో కనిపిస్తా. నా అభిమాన నటుడు రజనీకాంత్ 'చంద్రముఖి'లో చేసిన పాత్రని ఇందులో నేను చేయడం సంతోషంగా ఉంది. నాకు చేతనైనంతలో నిజాయితీగా ఆ పాత్రని చేశా అన్నారు వెంకటేష్. ఆయన తాజా చిత్రం 'నాగవల్లి' లోగో ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...ఇది నా కెరీర్‌లోనే వైవిధ్యమైన సినిమా. చాలా ఆసక్తికరమైన పాత్ర. ఇన్వెస్టిగేషన్ ఉండే పాత్ర చేయడం ఇదే ప్రథమం. పి. వాసు కథని అందించిన 'చంటి'లో చేసిన నేను తొలిసారి ఆయన డైరెక్షన్‌లో చేశా.
ఇది భయపెట్టే సినిమా కాదు. కుటుంబంలోని అన్ని వయసుల వాళ్లూ ఆస్వాదించదగ్గ సినిమా. 'నాగవల్లి' తరహాలోనే ముందు ముందు మంచి ఇంటరెస్టింగ్ పాయింట్స్‌తో ఎవరైనా వస్తే సీక్వెల్స్‌ని తప్పకుండా చేస్తా. ఈ సినిమాకి బెల్లంకొండ సురేశ్ సరైన నిర్మాత'' అని ఆయన అన్నారు. ఇక నిర్మాత సురేశ్ మాట్లాడుతూ "ఈ నెల 16న శిల్పకళావేదికలో ఆడియో వేడుక జరుపుతాం. డిసెంబర్ 2న సినిమాని విడుదల చేయాలని సంకల్పించాం. మా సంస్థకి ఇది ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుంది'' అని చెప్పారు. రామానాయుడు సినీ విలేజ్‌లో ఆ సినిమా సెట్స్‌పై ఈ కార్యక్రమం జరిగింది.


Click it and Unblock the Notifications











