విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు.. కూతురు పెళ్లికి ముహూర్తం ఖరారు!
తెలుగు సినిమా పరిశ్రమలో త్వరలో మరో భారీ వివాహ వేడుక జరుగబోతోంది. కొన్ని రోజుల క్రితమే రాజమౌళి కుమారుడి వివాహం జరుగగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు. మరికొన్ని రోజుల్లో విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి.
వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో సెటిలైన తెలిసిందే. తాజాగా నిశ్చితార్థం, పెళ్లి ముహూర్థం ఖరారైనట్లు తెలుస్తోంది.

నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడంటే..?
ఆశ్రిత తగ్గుబాటి నిశ్చితార్థం నేడు(ఫిబ్రవరి 6)న హైదరాబాద్‌లో జరుగబోందని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఫంక్షన్‌లా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుగబోతోందని సమాచారం. పెళ్లి ముహూర్థం మార్చి 1న నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రేమ వివాహం
ఈ జంటది ప్రేమ వివాహం అని చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా స్నేహం ఉందని, ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైనట్లు సమాచారం.

బంధువులు, సన్నిహితులు మాత్రమే
టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటారు. అందుకే నేడు జరుగబోయే ఎంగేజ్మెంట్ వేడుకకు కొందరు బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.

‘ఎఫ్ 2'తో హిట్ ట్రాక్‌లోకి..
వెంకటేష్ ‘ఎఫ్ 2' సినిమాతో భారీ విజయం అందుకుని మళ్లీ బ్లాక్ బస్టర్ ట్రాక్‌లోకి వచ్చాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించి రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











