వెంకటేష్ అక్రమ నిర్మాణం, స్వయంగా కూల్చివేత
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు వెంకటేష్ తాను నిర్మించిన అక్రమ నిర్మానాన్ని తానే స్వయంగా కూలీలతో కూల్చి వేయించారు. ఫిల్మ్ నగర్లోని తన ఫ్లాటులో వెంకటేష్ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయకపోతే తామే కూల్చివేస్తామంటూ జిహెచ్ఎంసీ నోటీసులు జారి గడువు విధించారు. దీంతో వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి దాన్ని కూలీలతో కూల్చివేయించారు.
వెంకటేష్ సినిమాల విషయానికొస్తే...

ప్రస్తుతం ఆయన ‘గోపాల గోపాల' చిత్రంలోనటిస్తున్నారు. వెంకటేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడ తగ్గకుండా సినిమాను తీశామని నిర్మాతలు డి.సురేష్‌బాబు, శరత్‌మారార్‌లు తెలిపారు. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications










