twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12000 ఎకరాల్లో నారప్ప ఫుల్ యాక్షన్.. వెంకటేష్ పవర్‌ఫుల్‌గా

    |

    తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్‌' చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు‌లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో 'నారప్ప' కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

    యాక్షన్ సీన్లు చిత్రీకరణ

    యాక్షన్ సీన్లు చిత్రీకరణ

    తమిళనాడులోని రెడ్ డెసర్ట్ లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్ అవుతుంది. వెంకటేష్ గారికి, నాకు 'నారప్ప' ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని కలిగించింది అని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అన్నారు. ఇప్పటికే 27 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ అన్నారు.

    నారప్ప‌గా వెంకటేష్ పవర్‌పుల్‌

    నారప్ప‌గా వెంకటేష్ పవర్‌పుల్‌

    నారప్ప మోస్ట్ పవర్‌పుల్‌గా, ఎమోషనల్ కేరక్టర్. ప్రేక్షకులు నారప్పగా కొత్త వెంకటేష్ గారిని చూస్తారు. అసురన్‌కు ఏ మాత్రం తగ్గకుండా తెలుగుకు అనుగుణంగా మార్పులు చేస్తూ సినిమాను ఎమోషనల్‌గా తెరకెక్కిస్తున్నాం అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు.

    12 వేల ఎకరాల్లో..

    12 వేల ఎకరాల్లో..

    తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు లో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. 12,000 ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని తమిళనాడు ఎరుపు ఎడారి అని (రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు) అంటారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో 'నారప్ప' కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాము అని కో- ప్రొడ్యూసర్ దేవి శ్రీదేవి సతీష్ అన్నారు.

    Recommended Video

    Naarappa Action Sequence's Will Be Directed By Star Director | Filmibeat Telugu
    టెక్నికల్ టీమ్

    టెక్నికల్ టీమ్

    సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు,
    సంగీతం: మణిశర్మ,
    ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
    ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
    కథ: వెట్రిమారన్‌,
    స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
    ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
    లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
    స్టిల్స్: నారాయణ, జి. శ్రీను,
    పబ్లిసిటీ డిజైనర్: రామ్ పెద్దిటి,
    ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
    ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
    ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ దొంకాడ,
    కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌,
    నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను,
    దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

    English summary
    Victory Venkatesh who has delivered back to back blockbusters is now shooting his next, 'Naarappa'. This is an official remake for Tamil Blockbuster Hit 'Asuran'. D Suresh Babu and Kalaippuli S Thanu are Producing 'Naarappa' under Suresh Productions Pvt Ltd and V Creations banners in Sreekanth Addala's Direction. 'Narappa' is currently canning crucial action sequence under the supervision of popular fight master Peter Heins at Tamil Nadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X