twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ సినిమాపై తెలంగాణ ఎఫెక్టు

    By Srikanya
    |

    వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన నమో వెంకటేశ చిత్రం పైన కూడా తెలంగాణ ఉద్యమ ప్రభావం పడింది. ఈ చిత్రం విడుదల ముందుగా అనుకున్నట్లుగా సంక్రాంతికి రిలీజ్ కావటం లేదు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే నాగార్జున కేడీ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజయ్యే వాతావరణం కనపడటం లేదు. ఇక ఈ చిత్రం విడుదల వాయిదాకు కారణంగా ...ఎవరూ రిస్క్ తీసుకోవటానికి రెడీ గా లేరు..సినిమా అంటే కోట్లుతో కూడుకున్న వ్యాపారం అని చెప్తున్నారు. ఇక వెంకటేష్ రిలీజ్ పై ఆయన అన్న కుమారుడు రాణా చిత్రం లీడర్ విడుదల ఆధారపడి ఉంది. రెండు చిత్రాలకు మినిమం గ్యాప్ ఉండాలని చూస్తున్నారు. ఇక నమో వెంకటేశ చిత్రం పూర్తి స్ధాయి శ్రీను వైట్ల మార్కు కామిడీతో నింపారని తెలుస్తోంది. అలాగే త్రిష,వెంకటేష్,బ్రహ్మానందం ల మద్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయంటున్నారు. ఇక ఈ చిత్రం కూడా డ్రాప్ అవటంతో అదుర్స్ మాత్రమే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X