twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్, త్రిష చిత్రం ప్రారంభ విశేషాలు

    By Srikanya
    |

    వెంకటేశ్, త్రిష కాంబినేషన్ లో బాడీ గార్డ్ రామేక్ గా రూపొందుతున్న చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు.హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి.రామానాయుడు క్లాప్‌నివ్వగా,దర్శకుడు శ్రీను వైట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రారంభపు సన్నివేశానికి వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.దర్శకులు బోయపాటి శ్రీను, దశరథ్, నందినిరెడ్డి స్క్రిప్టును దర్శకుడు గోపిచంద్‌కు అందజేశారు.

    ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వెంకటేశ్ మాట్లాడుతూ ..'నాగవల్లి' తర్వాత వెంటనే బెల్లంకొండతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది.మంచి ఫీల్ ఉన్న ఈ కథలో అన్ని తరగతుల వారు మెచ్చే అంశాలున్నాయి అన్నారు.త్రిష మాట్లాడుతూ.. మూడోసారి వెంకటేశ్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందనీ, అందమైన కథతో ఈ సినిమా తయారవుతున్నదనీ అంది. దర్సకుడు గోపీచంద్ మలినేని...వెంకటేశ్ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోయే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలుపగా, మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తున్నామని నిర్మాత సురేశ్ చెప్పారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుతామన్నారు.

    ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తారాగణమైన ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం: ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, డాన్స్: రాజుసుందరం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేంద్రబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని.

    English summary
    Venkatesh’s new project ‘Bodyguard’ has been launched at Ramanaidu Studios, Hyderabad . Bellamkonda Suresh is producing the film on Sai Ganesh Productions (P) Ltd Banner in the direction of Gopichand Malineni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X