అఫీషియల్: వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ
Recommended Video

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఖరారైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ప్రొడక్షన్ నెం.6గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రం
త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయేఈ చిత్రం వెంకీ కెరీర్లో 75వ చిత్రం కాబోతోంది. ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గురు' తర్వాత వెంకటేష్ బొమ్మరిల్లు భాస్కర్, తేజ, అనిల్ రావిపూడితో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు కానుంది.

గతంలో వెంకీ సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్
దర్శకుడిగా మారక ముందు త్రివిక్రమ్ పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే. అందులో వెంకీ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్', వాసు, మల్లీశ్వరి లాంటి చిత్రాలు ఉన్నాయి. అప్పటి నుండే వెంకీతో త్రివిక్రమ్‌కు మంచి అనుబంధం ఉంది.

చాలా కాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులు
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇది నిజం కాబోతోంది. హారిక హాసిని బేనర్లో ప్రొడక్షన్ 6గా ఈ ఇద్దరి సినిమా రాబోతోందని పోస్టర్స్ విడుదలైన తర్వాత పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వెంకీ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ మూవీ చేయనున్న త్రివిక్రమ్
వెంకటేష్ సినిమా కంటే ముందు త్రివిక్రమ్.... ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. హారిక హాసిని బేనర్లో తెరకెక్కుతున్న ఈచిత్రం ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. జనవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











