వివి వినాయక్ క్లాప్, వెంకటేష్ ‘రాధా’ ప్రారంభం (ఫోటోలు)
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, నయనతార హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధా' చిత్రం ప్రారంభమైంది. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రం గురువారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకుంది.
ప్రముఖ నిర్మాత రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దర్శకుడు మారుతికి స్క్రిప్టు అందించారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో కోనవెంకట్, గోపీచంద్ మలినేని, సురేస్ బాబు, జెమినీ కిరణ్, బెల్లంకొండ సురేష్, శరత్ మరార్, అశోక్ బాబు, కె.ఎస్.రామారావు, పరుచూరి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...
బస్ స్టాప్ సినిమా తర్వాత వెంకటేష్ గారు నన్ను పిలిపించారు. అప్పటి నుండి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు లవ్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టెన్మెంట్ మూవీని అందిస్తున్నాను అన్నారు. సినిమాలో డైలాగ్స్ నుండి డ్రెస్సింగ్ వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి. నయనతార నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తోంది అన్నారు.

వెంకీ హోం మినిస్టర్
ఇందులో వెంకటేష్ హోం మినిస్టర్‌గా, నయనతార మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తుంది. వీరి మధ్య సాగే ప్రేమకథతోనే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుత ట్రెండుకు తగిన విధంగా ఉంటుంది.

డివివి దానయ్య
డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాధా'. డి. పార్వతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ 2013లో మా బేనర్లో నాయక్ లాంటి హిట్ చిత్రాన్ని అందించాం. ఇపుడు వెంకటేష్ తో ‘రాధా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హిట్టవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

రాధా
వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సనిమా కావడం, వెంకీ-నయనతార లాంటి హిట్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈచిత్రానికి సమర్పకులు : డి. పార్వతి, సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాత : డివివి దానయ్య, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మారుతి.


Click it and Unblock the Notifications











