ఫిల్మ్‌సిటీలో లో వెంకటేష్ గణపతి నవరాత్రులు
దాంతో శరణు గణేశా... స్వామి గణేశా... అంటూ పందిట్లో భక్తి గీతం వినిపిస్తోంది. అక్కడ ఉన్న కుర్రాళ్లంతా సందడిగా ఉన్నారు. అన్న అడుగుపెట్టేసరికి వాళ్ల హుషారు రెట్టింపైంది. ఈ గణపతి ఉత్సవాలను కనువిందుగా 'షాడో'లో చూపించబోతున్నారు. వెంకటేష్, తాప్సి జంటగా నటిస్తున్న చిత్రం 'షాడో'. శ్రీకాంత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'షాడో'. వెంకీ ఇందులో డాన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరో వెంకటేష్, హీరోయిన్ తాప్సీలతో యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ పార్టు చిత్రీకరించనున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












