వెంకీ ‘షాడో’ ఫైనల్ షెడ్యూల్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'షాడో'. వెంకీ ఇందులో డాన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుది. ఇటీవలే మలేషియాలో షూటింగ్ పూర్తయింది. సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. కొన్ని సీన్లు, సాంగులను హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.

వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ 'షాడో' చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది.
సక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











