వెంకీ ‘షాడో’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన నిర్మాత
హైదరాబాద్: వెంకటేష్, తాప్సీ హీరో హీరోయిన్లుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎ యూస్క్వేర్ మూవీస్ పతకంపై పరుచూరి కిరీటి సమర్పణలో పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. ఈ చిత్రం మార్చి 27,2013న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్ర పోషిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా చేస్తోంది.
దర్శకుడు మెహర్ రమేష్ఈ చిత్రం గురించి చెపుతూ.... మంచి, చెడు... ఈ రెండు మార్గాలూ ఎదురుగా ఉన్నప్పుడు మంచే ఎంచుకోవాలి. కానీ గమనం, గమ్యం.. రెండూ చేతిలో లేనప్పుడు, వెనుక ప్రమాదం తరుముతున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అతను రెండో దారి ఎంచుకొన్నాడు. ముళ్ల బాటలో పులి మీద సవారీ చేశాడు. ఆ పులి పేరు... మాఫియా. ఆ ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ- హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించామన్నారు. థమన్ చక్కని సంగీతం అందించారన్నారు. ఇటీవల రిజలైజన టీజర్‌కి ముఖ్యంగా టైటిల్ ట్రాక్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వెంకటేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారన్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది వైవిధ్యమైన చిత్రమన్నారు. జనవరి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతుందన్నారు.
ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ధర్మవరపు, ముఖేష్ రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్, గోపిమోహన్, మాటలు:కోన వెంకట్, మెహర్ రమేష్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: థమన్, ఫైట్స్: రామ్ -లక్ష్మణ్, హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్:మార్తాండ్.కె, డాన్స్ రాజు, కథనం - దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











