వెంకటేష్ కొడుకు ఎంట్రీ ఖరారు, అతిథి పాత్రలో...!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఈ చిత్రంలో అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
అర్జున్ బాల నటుడిగా వెండి తెరపై కనిపించబోతున్న తొలి సినిమా ఇదే. వెంకీతో కలిసి పలు సీన్లలో అర్జున్ కనిపించబోతున్నాడు. అర్జున్ కనిపించే సీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అర్జున్‌కు ఎలా యాక్ట్ చేయాలనే విషయంలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ మధ్య '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా మహేష్ బాబు కొడుకు గౌతం ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల 'మనం' చిత్రంతో అకిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు 'గోపాలా గోపాలా' చిత్రంతో అర్జున్ వెండి తెర తెరంగ్రేటం చేస్తుండటం గమనార్హం. స్లైడ్ షోలో గోపాలా గోపాలా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు...

అర్జున్
ఇటీవల ‘గోపాలా గోపాలా' చిత్రం ప్రారంభోత్సవంలో అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

గోపాలా గోపాలా
'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా 'గోపాలా ...గోపాలా' చిత్రం నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది.

నటీనటులు
నాయికగా 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని.

టెక్నీషియన్స్
'గోపాల..గోపాల' చిత్రానికి కధ - భవేష్ మందాలియ,ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే- కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా - జయనన్ విన్సెంట్, మాటలు - సాయి మాధవ్, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - చంద్ర బోస్, ఎడిటింగ్ - గౌతం రాజు, ఆర్ట్ - బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ - సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ - పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ - వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్.


Click it and Unblock the Notifications











