'వెంకీ మామ' ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్.. ఏరియాలో వైజ్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే..?
వెంకటేష్ సినిమాలంటేనే ఓ రకమైన క్రేజ్ ఉంటుంది ప్రేక్షకుల్లో. ఇక ఆయన నటిస్తున్న నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లపై ఎగబడుతుంటారు. అలాంటి సమయం మళ్ళీ వచ్చేసింది. డిసెంబర్ 13న 'వెంకీ మామ' మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిందని సమాచారం.

అభిమానుల్లో ఆతృత.. భారీ బజ్
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య.. 'వెంకీ మామ' ద్వారా వెండితెర మామాఅల్లుళ్లుగా మారబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన లుక్స్, సాంగ్స్ విడుదలై ఇరువురి అభిమానుల్లో ఆతృత పెంచేశాయి. దీంతో రిలీజ్‌కి ఈ సినిమాపై భారీ బజ్ నెలకొంది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో భారీగా బిజినెస్ జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెంకీమామ సినిమా 27.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అదే విధంగా కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 2.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.8 కోట్లు, ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 33.1 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఏ ఏరియాలో ఎంతెంత..?
ఇక ఏరియా వైస్ రిపోర్ట్ చూసినట్లయితే.. నైజాంలో 7.5 కోట్లు, సీడెడ్‌లో 5.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.4 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్లు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 2.4 కోట్లు, నెల్లూరులో 1.3 కోట్ల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా 34 కోట్ల టార్గెట్‌తో వెంకీమామ బరిలోకి దిగుతోంది.

వెంకీమామ మూవీ
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీమామ సినిమాను వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్ పుష్కలంగా ఉంటుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











