హీరోయిన్ దొరక్కే సినిమా ఆగింది: డి.సురేష్ బాబు ఖండన
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో సావిత్రి అనే చిత్రం గత రెండున్నరేళ్ళుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ చిత్రం ఇక ఆగిపోయినట్లే అంటూ వార్తలు వచ్చాయి. తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి పోలికలు ఉంటాయనే కారణంతో ఈ చిత్రం ఆగిపోయిందని చెప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు ఖండిస్తున్నారు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..సావిత్రి చిత్రానికి స్క్రిప్టు, దర్శకుడు, హీరో, నిర్మాత అంతా రెడి. ఎటొచ్చీ హీరోయిన్ దొరక్క ఆగిపోయాం. ఆమె దొరకగానే ప్రారంబిస్తాం.ఇక మెంటల్లీ ఛాలెంజెడ్ పాత్రలను గతంలో వెంకటేష్ చంటి చిత్రంలో చేసాడు కాబట్టి అస్సలు సమస్యే లేదు అన్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో బాడీగార్డ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని డాన్ శీను డైరక్టర్ డైరక్ట్ చేస్తూండగా, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











