For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'షాడో' పై అవి కేవలం రూమర్స్ : వెంకటేష్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'షాడో' లో నా పాత్ర మాఫియా డాన్ అని ప్రచారం జరుగుతున్నట్లుంది. కానీ నాది మాఫియా డాన్ పాత్ర కాదు. ఆ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు వెంకటేష్. 'షాడో' ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన హైదరబాద్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

    'షాడో' సినిమా గురించి చెప్తూ.... సినిమా చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తరవాత పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా చేస్తున్నా. అలాగని భీకరంగా కొట్టుకోవడం, నరుక్కోవడం ఏమీ ఉండదు. యాక్షన్‌ ఘట్టాల్ని చాలా స్త్టెలిష్‌గా చూపించారు. మళ్లీ మళ్లీ చూసేలా ఉంటాయి. కథ ఓ ప్రతీకార సూత్రం ప్రకారం నడుస్తుంది. ఉగాది పచ్చడిలా అన్ని రుచులూ ఉంటాయి. కుటుంబ బంధాలు, యాక్షన్‌నీ... తెలివిగా దర్శకుడు కలబోశాడు అన్నారు.

    ఇక ఈ వేసవికి అందరికీ నచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. తమన్‌ అందించిన అన్ని పాటలూ బాగున్నాయి. ముఖ్యంగా 'షాడో.. షాడో' నాకు బాగా నచ్చింది. ఈమధ్య కాలంలో అంత భారీగా తెరకెక్కించిన పాట అదేనేమో? 'పిల్లా మస్తుగుంది', 'నాటీ నాటీ గాళ్‌' పాటలు మాస్‌కి నచ్చుతాయి అన్నారు.

    మెహర్‌ ఈ సినిమాని చక్కగా తీర్చిదిద్దారు. అతని ట్రాక్‌ రికార్డు నేనేం పట్టించుకోలేదు. కథ నచ్చింది. ఆ సమయంలో అన్నీ అలా కుదిరాయంతే. నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఆ సమయానికి ఏది అనిపిస్తే అది చేయడమే తెలిసింది. తప్పో, ఒప్పో ఆలోచించను. ఫలితం కాలం నిర్ణయిస్తుంది. నా కెరీర్‌ అంతా ఇలాగే సాగింది. ఇక ముందూ అంతే అన్నారు.

    ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ధర్మవరపు, ముఖేష్ రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్, గోపిమోహన్, మాటలు:కోన వెంకట్, మెహర్ రమేష్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: థమన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్:మార్తాండ్.కె, డాన్స్ రాజు, కథనం - దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Venkatesh's Shadow shooting is almost completed and recently the film unit were shot climax sequence of the film.Now the latest news is that the movie release date has been confirmed,the movie audio will be released in the first week of March and the movie will hit the theaters ugadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X