వెంకటేష్ దృష్టిలో మహేష్,నాగార్జున లు కిడ్స్?
ట్విట్టర్ లో మన తెలుగు స్టార్స్(మహేష్, సిద్దార్ధ,నాగార్జున) కూడా జాయిన్ అయి సందేశాలు పంపుతున్న సంగతి తెలిసిందే. అయితే వెంకేటష్ ని కలిసిన సిద్దార్ధ ఈ ట్విట్టర్ గురించి ప్రస్దావించి ఆయన్ను కూడా ట్విట్టర్ లో చేరి సందేశాలు పంపమన్నారు. అయితే వెంకటేష్ నవ్వి ట్విట్టర్ అనేది కిడ్స్ కోసం అని వ్యాఖ్యానించారు. అంటే ట్విట్టర్ లోకి వెళ్ళిన మన హీరోలు కూడా కిడ్స్ అనా ఆయన ఉద్దేశ్యం అని మాట్లాడుకుంటున్నారు. ఇత నాగార్జున(ఐ యామ్ నాగార్జున), మహేష్ బాబు(యువర్స్ ట్రూలీ మహేష్), సిద్దార్ధ(ఏక్టర్ సిద్దార్ధ) ఈ ట్విట్టర్ ని ఉపయోగించుకుంటూ మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రైయిట్ గా వారినుంచే ఇక మనకి వారి న్యూస్ లు తెలుస్తాయి. మహేష్ బాబు రీసెంట్ గా తన లేటెస్ట్ చిత్రం ఆగస్టు 2010లో రిలీజ్ కానుందని, త్వివిక్రమ్ తో తనకు విభేధాలు లేవని ట్వీట్ చేసారు. అలాగే నాగార్జున తను స్పోర్ట్ కారు కొనుక్కోబోతున్నానని ట్వీట్ చేసి సందేశం పంపారు. ఆయన అభిమానులు. తిరిగి సందేశం పంపంటం ద్వారా నాగార్జునకి సలహాలు ఇవ్వవచ్చు. ప్రస్తుతం వెంకటేష్..ఆప్త రక్షక రీమేక్ నాగమల్లిలో నటిస్తున్నారు. ఆయన సరసన అనుష్క లీడ్ రోల్ లో చేస్తోంది. పి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











