‘షాడో’ ఆడియో విశేషాలు (ఫోటోలతో)
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ - మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'షాడో' మూవీ ఆడియో వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకలావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివి వినాయక్, బోయపాటి శ్రీను, నాగబాబు తదితరులు హాజరయ్యారు. తొలి సిడీని వినాయక్ విడుదల చేసి బోయపాటి శ్రీనుకు అందజేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ...'తమన్ ఈచిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. సినిమా మొదలు పెట్టడానికి ముందు వెంకటేష్‌గారు, నిర్మాత కిరీటి, నేను ఒకే ఆప్షన్‌గా తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నాం. మా నమ్మకాన్ని నిలబెట్టి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. డిబ డిబరో సాంగ్ చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసారు. వినాయక్ ఇన్స్‌ఫిరేషన్‌తో ఈ సినిమా చేసాను. వెంకీ-వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమా 'షాడో'కు బేస్' అని చెప్పుకొచ్చారు.
వెంకటేష్ మాట్లాడుతూ...'మెహర్ రమేష్ కథ చెప్పిన రోజే నచ్చేసింది. స్టైలిష్‌గా చూపిస్తాడని నేను భావించినట్లుగానే బాగా తీసాడు. తమన్ సంగీతం పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది. సినిమాలో మాస్ కు నచ్చే అంశాలతో పాటు లేడీస్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. ప్రతి టెక్నీషియన్ కష్టపడి పని చేసారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను' అని వ్యాఖ్యానించారు.

షాడో ఆడియో సీడీని ఆవిష్కరిస్తున్న దృశ్యం.

తొలి సీడీని విడుదల చేసి బోయపాటికి అందిస్తున్న వినాయక్.

షాడో ఆడియో సీడీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.

మెహర్ రమేష్, వెంకటేష్, తాప్సీ, శ్రీకాంత్.

ఆడియో వేడుకకు హాజరవుతున్న మధురిమ.

అభిమానులు అభివాదం చేస్తున్న వెంకటేష్.

భార్యతో కలిసి ఆడియో వేడుకకు హాజరైన బాబా సెహగల్.
ఈ కార్యక్రమంలో తాప్సీ, మధురిమ, శ్రీకాంత్, మధురిమ, కోనవెంకట్, బాబా సెహగల్, గోపీమోహన్, పరుచూరి కిరీటి, గీతా మాధురి తదితరలు పాల్గొన్నారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











