twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' కి దక్కనిది వెంకీ 'షాడో' కి

    By Srikanya
    |

    హైదరాబాద్ : త్వరలో విడుదల కాబోతున్న వెంకటేష్‌ తాజా చిత్రం 'షాడో' మరో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ఈ సినిమాను 'ఆరో త్రీడీ' అనే శబ్ద విధానం ద్వారా తెరపైకి తీసుకురాబోతున్నారు. మొదట 'విశ్వరూపం' చిత్రాన్ని ఆరో త్రీడీలోనే ప్రేక్షకులకు చూపించాలనుకొన్నారు. సాధ్యపడలేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణాదిన విడుదలవుతున్న మొదటి చిత్రం 'షాడో'. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

    ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ''ఈ వేసవిలో షాడోతో ఇంటిల్లిపాదికీ వినోదాలు పంచుతాను. దర్శకుడు మెహర్‌ రమేష్‌ ప్రతి సన్నివేశాన్నీ ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు. తమన్‌ సంగీతం చాలా బాగుంది''అన్నారు. వెంకీకి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

    మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ''యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది ఈ చిత్రం. ఆరో 11.1 త్రీడీ శబ్దంతో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలగజేస్తుంది''అన్నారు. నిర్మాత పరుచూరి శివరామప్రసాద్‌ మాట్లాడుతూ ''ఈ వేసవిలో విందు భోజనం లాంటి చిత్రమిది. పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.

    నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌, సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Shadow will be the first Telugu film to be screened in Auro 11.1 3D sound system in AP. The screen 1 of Prasads Multiplex, Hyderabad was recently equipped with Auro 3D sound system with 55 speakers. The first film to be screened in Prasads using Auro 3D was the Hollywood animation film ‘The Croods 3D’. Shadow film features Venkatesh in title role. Meher Ramesh who has technology inclination has shot this film stylishly in Malaysia. SS Thaman scored music. Shadow is releasing with maximum number of prints on 26th of April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X