వెంకటేష్ ‘షాడో’ కామెడీగా...
విక్టరీ వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'షాడో' చిత్రం మాఫియా నేపథ్యం ఉంటుందని, వెంకీ ఇందులో డాన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ టచ్ కూడా మెండుగా ఉంటుందని అంటున్నారు ఈచిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్. సినిమా పేరుకు తగిన విధంగానే మాఫియా బ్యాగ్రౌండ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా ఉంటుందని ఆయన తెలిపారు.
యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటించనుంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి అతని భార్యగా నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా మరో హీరోగా చేస్తున్నాడు. దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











