వెంకటేష్ 'షాడో' లేటెస్ట్ ఇన్ఫో
మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటించనుంది. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో వెంకటేష్, తాప్సీలపై రెండు పాటల్ని తెరకెక్కించారు. రాజు సుందరం నృత్యరీతులు సమకూర్చారు. త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో మరో గీతాన్ని చిత్రీకరిస్తారు. ఇందుకోసం అక్కడో భారీ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ...'యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. వెంకటేష్ హావభావాలు, వేషధారణ కొత్తగా కనిపిస్తాయి''అన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ తన శైలి మార్చారు. గెడ్డం... కొత్త తరహా కేశాలంకరణతో కెమెరా ముందుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది.
హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్నారు. మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ధర్మవరపు, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్.
ఇక వెంకటేష్ అన్న కొడుకు రానాతో పరుచూరి ప్రసాద్ ఇప్పటికే నా ఇష్టం చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసారు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం యావరేజ్ గా ఆడిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టు కొట్టాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్.. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. మహేష్,వెంకటేష్ ఆ చిత్రంలో అన్నదమ్ములుగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











