తేడా వస్తే వెంకటేష్ లో ఉగ్రరూపాన్ని చూస్తారు

By Srikanya

హైదరాబాద్ : మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 'షాడో' సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మాఫియా డాన్ గా వెంకటేష్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. "మంచిగా ఉంటే ప్రాణమైనా ఇస్తాడు. తేడా వస్తే అతనిలో ఉగ్రరూపాన్ని చూస్తారు. అతని పేరు చెబితే ఎంతటివాళ్లయినా వణుకుతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏం చేస్తాడు? అతని లక్ష్యం ఏమిటన్నది 'షాడో' చిత్రంలో చూడాల్సిందే" అన్నారు.

అలాగే ''అటు మాస్‌నీ, ఇటు యువతనీ అలరించేలా ఉంటుందీ చిత్రం. దీంట్లో వెంకటేష్‌ పాత్ర ఎంతో ఆధునికంగా ఉంటుంది. ఆయనపై చిత్రించిన పోరాట సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. మాఫియా నేపథ్యం ఉన్న కథ ఇది. వినోదం పుష్కలంగా ఉంటుంది. యాక్షన్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. వెంకటేష్‌ హావభావాలు, వేషధారణ కొత్తగా కనిపిస్తాయి''అన్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో వెంకటేష్‌, ఎమ్మెస్‌ నారాయణలపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. శ్రీకాంత్‌, మధురిమ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 19 న టీజర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటిస్తోంది. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఆగస్టు 19 నుంచి ముంబై లో ప్రారంభం కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్నారు. మధురిమ, ఎమ్మెస్‌ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ధర్మవరపు, ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ తన శైలి మార్చారు. గెడ్డం... కొత్త తరహా కేశాలంకరణతో కెమెరా ముందుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది. సంగీతం: తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X