ఎ రివేంజ్ స్టోరీ (‘షాడో’ప్రివ్యూ)
హైదరాబాద్ :యు స్క్వేర్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం 'షాడో'. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధాన పాత్రలుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్ నిర్మించారు. పరుచూరి కిరీటి సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల కానుంది. సోలో హీరోగా హిట్ వచ్చి చాలా కాలం అయిన వెంకటేష్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదలయ్యి పెద్ద హిట్‌గా నిలిచాయని, ప్లాటినమ్ రేంజ్‌కి వచ్చి తమ సినిమాకు ప్లస్‌గా మారాయని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. వెంకటేష్ కెరీర్‌లో పెద్ద హిట్ సినిమాగా షాడో నిలుస్తుందని ఆయన తెలిపారు. ఫ్యామిలీ, మాస్, క్లాస్ అందరికీ నచ్చే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిందని, ఈ సినిమాను వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, వెంకీ స్టయిలిష్ యాక్షన్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని వివరించారు.
వేసవిలో క్లాస్ మాస్ అని లేకుండా అందరికీ నచ్చే సరికొత్త యాక్షన్ సినిమాగా 'షాడో' ఉంటుందని, ఎమోషనల్ డ్రామాతో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం వేసవిలో పెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వెంకటేష్ తెలిపారు. హై క్వాలిటీ 'ఆరో 11.1 3డి' సౌండ్ తో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించలేదు.
నటీనటులు : వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ తదితరులు
కథ: కోనవెంకట్, గోపిమోహన్.
మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్,
సంగీతం: తమన్.
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల,
ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్.
ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్.
ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ,
నిర్మాత: పరుచూరి కిరీటి,
దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











