Don't Miss!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మారిన పీఎఫ్ విత్‌డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
వెంకటేష్ ‘షాడో’ న్యూలుక్ (ఫోటోస్)
హైదరాబాద్:
విక్టరీ
వెంకటేష్,
మెహర్
రమేష్
కాంబినేషన్లో
రూపొందుతున్న
యాక్షన్
ఎంటర్
టైనర్
'షాడో'.
వెంకీ
ఇందులో
డాన్
పాత్ర
పోషిస్తున్నారు.
ప్రస్తుతం
ఈచిత్రం
శర
వేగంగా
షూటింగ్
జరుపుకుంటోంది.
ఈ
చిత్రంలో
వెంకటేష్
డిఫరెంట్
గెటప్స్
లో
కనిపించనున్నాడు.
తాజాగా
ఈ
చిత్రానికి
సంబంధించిన
వెంకటేష్
న్యూలుక్
ఫోటోస్
విడుదల
చేసారు.
ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ‘షాడో' చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది.
వెంకీ గత చిత్రాల కంటే ఈచిత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది.
సంక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
వెంకటేష్ ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు హీరో రామ్ తో కలిసి మరో మల్టీ స్టారర్ మూవీకి కమిట్ అయ్యాడు వెంకీ.
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.