వెంకటేష్ ‘షాడో’నెక్ట్స్ షెడ్యూల్ మలేషియా
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం తదుపరి షెడ్యూల్ మలేషియాలో జరుగనుంది. జులై 14 నుంచి ఇక్కడ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో పలు స్టైలిష్ యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు.
ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్‌గా కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని..యునైటెడ్ మూవీస్ పతాకం సింహా చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. అయితే మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











