twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ ‘షాడో’ తాజా విశేషాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.

    ఈ షెడ్యూల్‌లో హీరో వెంకటేష్, హీరోయిన్ తాప్సీలతో యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ పార్టు చిత్రీకరించేందుకు దర్శకుడు మెహర్ రమేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం తొలి టీజర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్‌గా కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది.

    థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని..యునైటెడ్ మూవీస్ పతాకం సింహా చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. అయితే మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది. సక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    The fresh schedule of Victory Venkatesh's new movie 'Shadow' will begin from September 15 in and around Hyderabad. Meher Ramesh, the director of Shadow is planning to can action sequences and crucial talkie part on Venkatesh and heroine Tapsi in this schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X