బాద్ షా ఎఫెక్ట్: ‘షాడో’ ఏప్రిల్ 26కు వాయిదా
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'షాడో' చిత్రం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 11న విడుదలవ్వాల్సి ఉండగా.... థియేటర్ల సమస్య కారణంగా ఏప్రిల్ 26కు వాయిదా పడింది. 'బాద్ షా' మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇదే సినిమా మూడు వారాల పాటు థియేటర్లు కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 'షాడో' చిత్రం 26కు వాయిదా వేసారు. మరో వైపు నాగార్జున 'గ్రీకు వీరుడు' చిత్రం కూడా ఏప్రిల్ 26కు వాయిదా పడింది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
సింగర్ గీతా మాధురి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఐటం సాంగుకులకు మంచి కిక్ ఇచ్చే వాయిస్‌తో పాటు, ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఇప్పటి వరకు తెర వెనక పాటలు పాడటానికే పరిమితం అయిన గీతా మాధురి త్వరలో తెరపై ఐటం సాంగులో కనిపించబోతోంది. షాడో చిత్రంలోని నాటీగర్ల్స్ అనే సాంగులో గీతా మాధురి సింగర్‌గా కనిపించబోతోంది. ఆమె మైక్ పట్టుకుని పాట పాడుతుంటే హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











