twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ 'షాడో' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'నేను ఎవరన్నది మిస్టరీ...నేను క్రియేట్ చేసింది హిస్టరీ...అడుగేస్తే విక్టరీ...' అంటూ ఇటీవల విడుదలైన 'షాడో' టీజర్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'షాడో'. తాప్సి హీరోయిన్ . శ్రీకాంత్‌, మధురిమ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం మలేషియాలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

    ఈ చిత్రం స్టోరీ గురించి దర్శకుడు మాట్లాడుతూ...'ఓ సాధారణ యువకుడు డాన్‌గా ఎదిగి అండర్ వరల్డ్ ప్రపంచాన్ని ఎలా శాసించాడన్నదే 'షాడో' చిత్ర కథ. వెంక కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఆయన పాత్ర చిత్రణ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో వెంక అండర్‌వరల్డ్ డాన్‌గా స్టైలిష్ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది'అన్నారు.

    అలాగే ''వెంకటేష్‌ సినిమా అంటే... ప్రేమ, వినోదం, యాక్షన్‌, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలకూ సమ ప్రాధాన్యముంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది. వెంకటేష్‌ని సరికొత్త పాత్రలో చూపించే ప్రయత్నం చేశాం. ఆయన వేషధారణ, హావభావాలు ఇందులో భిన్నంగా ఉంటాయి. శ్రీకాంత్‌తో కలిసి చేసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు.

    ''మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు నిర్మాత. వెంకి అభిమానులు ఆయన నుంచి ఏ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్ రావాలని ఆశిస్తున్నారో ఆ తరహా చిత్రమే 'షాడో'. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ చిత్రానికి సుప్రీత్‌, ఎమ్మెస్‌ నారాయణ, సత్యప్రకాష్‌ ఇతర పాత్రధారులు. కథ: గోపీమోహన్‌, కోన వెంకట్‌, సంగీతం: తమన్‌.

    English summary
    
 Venkatesh is playing powerful mafia don role in this movie for the first time. Mehar Ramesh is the director of the film. Paruchuri Shivaram Prasad is producing the movie on United Movies banner. Taapsee is the female lead in this film. This movie is touted to be a comedy action entertainer for which Kona Venkat and Gopi Mohan penning the script. Srikanth and Madhurima are the another lead pair in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X