చింతకాయల రవి సాఫ్ట్ వేర్ ఇంజనీర్!
చింతకాయల రవి సాఫ్ట్ వేర్ ఇంజనీర్...ఎవరూ అంటే విక్టరీ వెంకటేష్ గారూ అంటూ సమాధానం వస్తోంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే కంపెనీలో ఆల్రెడీ త్రిషా టీమ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా పనిచేసిన అనుభవం ఉన్న వెంకటేష్ ఇపుడు చింతకాయల రవిగా పేరు మార్చుకొని కొత్త సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. సాఫ్ట్ వేర్ రంగంలో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కొత్తేం కాదు కదా....మన వెంకటేష్ గారూ జస్ట్ నేమ్ చేంజ్ చేసుకున్నడంతే...చింతకాయల రవిగా..
ఈయన గారూ తయారు చేసుకుంటున్న విజిటింగ్ కార్డులో పేరు ఎలా పెట్టుకోవాలా అని యోచిస్తున్నారు... చింతకాయల రవి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పెట్టుకుంటే బావుంటుందా లేక చింతకాయల రవి కేరాఫ్ లండన్ పెట్టుకుంటే బావుంటుందా అనేది ఇపుడు ఆయనగారి సంశయం. ఈ చింతకాయల రవి గారూ పనిచేయనున్న కంపెనీ నిర్మాత నల్లమలుపు బుజ్జిట. నడిపే వ్యక్తి యోగిట. కోనవెంకట్ స్క్రిప్ట్ ను అందజేస్తున్నారట.
ఈ కంపెనీలో చింతకాయల రవి గారికి కంపెనీ ఇవ్వడానికి అందమైన అనుష్క జాయిన్ అవుతోంది.. రవి గారికి కంపెనీ ఇవ్వడానికి అనుష్క ఒక్కతే సరిపోదట. అందుకే ప్రియమణి గారి అప్లికేషన్ కూడా యోగిగారూ పరిశీలిస్తున్నారట. ఈ కంపెనీ సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్నది. అంటే షూటింగ్ మాత్రమే.


Click it and Unblock the Notifications











