twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ కొడుకు కూడా...

    By Staff
    |

    ఓ ప్రక్క నాగార్జున తనయుడు నాగచైతన్య తెరంగ్రేటం చేస్తూంటే వెంకటేష్ కూడా తన పుత్రుడుని తెరపై చూపాలని ముచ్చటపడుతున్నాడని తెలుస్తోంది. అయితే ఆ ముచ్చట కూడా జోష్ చిత్రంతోనే తీరనుందని సమాచారం. వెంకటేష్ ముద్దుల కుమారుడు అర్జున్ ఈ చిత్రంలో నాగచైతన్య చిన్నప్పుడు పాత్రలో కనిపించనున్నాడుట. అంటే బావ,బావమరుదుల పిల్లలిద్దరూ ఒకేసారి తెరంగ్రేటం చేస్తున్నారన్నమాట. ఇక జోష్ చిత్రంలో నాగచైతన్య సరసన ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా కనపడనుంది. వాసువర్మ దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు.మరో ప్రక్క ఇదే సమయానికి దగ్గుపాటి మరో వారసుడు రాణా కూడా లీడర్ చిత్రంతో ముందుకొస్తున్నాడు. రాణా హీరోగా చేస్తున్న చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రం తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఇదే. ఇక వెంకటేష్ ప్రస్తుతం పూర్తి చేసిన ఈనాడు చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఎ వెడ్నస్ డే రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు. అనంతరం వెంకటేష్..శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X