Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కోర మీసాలతో విక్టరీ వెంకటేష్
హైదరాబాద్: ప్రస్తుతం 'షాడో' షూటింగులో బిజీగా గడుపుతున్న విక్టరీ వెంకటేష్... దీని తర్వాత హిందీ మూవీ 'బోల్ బచ్చన్'కు రీమేక్‌గా రూపొందబోయే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వెంకటేష్ కోరమీసాలతో కనిపించబోతున్నారు. గతంలో వెంకీ ఘర్షణ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కోర మీసాలతో డిఫరెంట్ లుక్ లో నటించిన సంగతి తెలిసిందే.
'బోల్ బచ్చన్' చిత్రంలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను వెంకీ చేయబోతున్నాడు, మరో హీరో రామ్ అభిషేక్ బచ్చన్ పాత్రను పోషించబోతున్నారు. ఈచిత్ర యూనిట్ సభ్యులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... 'వెంకటేష్ గారు ఈ చిత్రంలో కోర మీసాలతో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది' అని తెలిపారు.
గతంలో వెంకటేష్ హీరోగా 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు విజయ భాస్కర్ 'బోల్ బచ్చన్' కు రీమేక్ గా రూపొందబోయే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనదైన దర్శకత్వ కోణంలో వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకీ సరసన నటించిన హీరోయిన్ అంజలి, ఈచిత్రంలో కూడా వెంకీ జోడీగా నటించబోతోంది. ఆరెంజ్ చిత్రంలో నటించిన షాజన్ పదంసీ రామ్ సరసన నటించబోతోంది. శ్రవంతి రవికిషోర్, డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.