twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర మీసాలతో విక్టరీ వెంకటేష్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రస్తుతం 'షాడో' షూటింగులో బిజీగా గడుపుతున్న విక్టరీ వెంకటేష్... దీని తర్వాత హిందీ మూవీ 'బోల్ బచ్చన్'కు రీమేక్‌గా రూపొందబోయే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వెంకటేష్ కోరమీసాలతో కనిపించబోతున్నారు. గతంలో వెంకీ ఘర్షణ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కోర మీసాలతో డిఫరెంట్ లుక్ లో నటించిన సంగతి తెలిసిందే.

    'బోల్ బచ్చన్' చిత్రంలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను వెంకీ చేయబోతున్నాడు, మరో హీరో రామ్ అభిషేక్ బచ్చన్ పాత్రను పోషించబోతున్నారు. ఈచిత్ర యూనిట్ సభ్యులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... 'వెంకటేష్ గారు ఈ చిత్రంలో కోర మీసాలతో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది' అని తెలిపారు.

    గతంలో వెంకటేష్ హీరోగా 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు విజయ భాస్కర్ 'బోల్ బచ్చన్' కు రీమేక్ గా రూపొందబోయే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనదైన దర్శకత్వ కోణంలో వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకీ సరసన నటించిన హీరోయిన్ అంజలి, ఈచిత్రంలో కూడా వెంకీ జోడీగా నటించబోతోంది. ఆరెంజ్ చిత్రంలో నటించిన షాజన్ పదంసీ రామ్ సరసన నటించబోతోంది. శ్రవంతి రవికిషోర్, డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

    English summary
    Victory Venkatesh, who is currently busy with his upcoming film Shadow, has earlier sported a twirled moustache while playing a revenge-seeking cop in Telugu action movie Gharshana. Now, this Tollywood star will repeat the look in the Telugu remake of Hindi Blockbuster film Bol Bachchan, which starred Ajay Devgan, Abhishek Bachchan, Asin and Prachi Desai in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X