ఆడవారి మాటలకు.. ప్రత్యేక సెట్
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు సినీ విలేజ్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో ఈ చిత్రం కోసం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ సెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మాత ఈ సెట్ వేయించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన త్రిష కథానాయిక. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 7జి బృందావన్ కాలనీ దర్శకుడు శ్రీరాఘవ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, శానం నాగ ఆశోక్‌కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. సంక్రాంతి, లక్ష్మి చిత్రాల విజయం తర్వాత వెంకటేశ్ చేస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications