తొలి మూడు రోజుల కలెక్షన్లు సూపర్
తొలి మూడు రోజుల కలెక్షన్లు వెంకటేష్‌బాబు గత చిత్రాల కలెక్షన్లను మించిపోయాయి. సినిమాకు మంచి స్పందన వస్తోంది అంటూ నిర్మాత బెల్లంకొండ సురేష్ తమ తాజా చిత్రం 'బాడీగార్డ్'గురించి మీడియాతో అన్నారు. వెంకటేష్, త్రిష జంటగా నటించిన చిత్రం 'బాడీగార్డ్'. బెల్లంకొండ సురేష్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మీడియాతో సమావేశమైంది. ఆ సందర్భంగా మాట్లాడుతూ బెల్లంకొండ.."ఈ నెల 18న విశాఖపట్టణంలోని వి-మాక్స్‌లో 'బాడీగార్డ్' ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహిస్తాం. గోపీచంద్ చక్కగా తెరకెక్కించాడు'' అని అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ "సినిమాకు మంచి స్పందన వస్తోంది. సకుటుంబంగా చూస్తున్నారు. పాజిటివ్ టాక్‌తో నడుస్తుంటే ఆనందంగా ఉంది. లేడీ గెటప్‌కు మంచి స్పందన వస్తోంది. కుటుంబకథా చిత్రంలో చాన్నాళ్ళ తర్వాత మంచి యాక్షన్ కూడా మిళితం చేశాం. ప్రకాష్‌రాజ్ పాత్రకు కూడా మంచి అప్లాజ్ వస్తోంది. సాయిగణేష్ సంస్థలో కథలను సిద్ధం చేస్తున్నారు. తదుపరి చిత్రం గురించి త్వరలో ప్రకటిస్తాం'' అని అన్నారు. "సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడం ఆనందంగా ఉంది. భావోద్వేగాలను ఎలా డీల్ చేస్తానోనని టెన్షన్ అనిపించేది. ఇప్పుడు గొప్ప రిలీఫ్‌గా ఉంది'' అని గోపీచంద్ మలినేని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్, ఆలీ కూడా పాల్గొన్నారు. సంక్రాంతి రోజు విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.


Click it and Unblock the Notifications











