చాలా రోజుల్నించి, అన్నయ్యా నేనూ అనుకుంటున్నదే..వెంకటేష్
చాలా రోజుల్నించి అన్నయ్యా, నేనూ షెర్లాక్ హోమ్స్ టైప్ పాత్రతో సినిమా చేయాలనుకున్నాం. ఆ కోరిక ఈ విధంగా తీరింది అని చెప్పారు అని వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లిపై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయంటూ ఈ విధంగా వివరించారు. అలాగే తెలుగు సినిమా అనగానే ఒక మూస చట్రంలో తిరుగుతోంది..ఏధైనా కొత్తగా ఆలోచించవచ్చు కదా అని మీడియావారు అడిగిన ప్రశ్నకు...నాకంత క్రియోటివిటీ లేదండి. నా దగ్గరకి ఏదైనా ప్రాజెక్టు వస్తే ఆ స్క్రిప్టు చూసి కమర్షియల్ గా ఉందా..బిజెనెస్ అవుతుందా అనే వాటిని ఏమైనా చెప్పగలను కానీ అంత క్రియోటివ్ గా ఆలోచించలేను. అంత క్రియోటివటీ ఉంటే వేరే ఫీల్డ్ లో ఉండేవాడ్నేమో..అంటూ ప్రాంక్ గా చెప్పుకొచ్చారు వెంకటేష్. ఇక పి.వాసు దర్శకత్వంలో రూపొందిన నాగవల్లి చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. నాగవల్లి చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, కమిలినీ ముఖర్జీ, పూనం కౌర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











