ఫ్లాప్ అని ముందే ఫ్రిపేరయ్యే ఆ సినిమా చేసాను..వెంకటేష్
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా 'సుభాష్ చంద్రబోస్"అనే ప్లాప్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమా చేసినందుకు మీరెప్పుడైనా పశ్చాత్తాపపడుతుంటారా అని మీడియా వారు అడిగిన దానికి వెంకటేష్ మాట్లాడుతూ..కొన్ని సినిమాలు చేసేటప్పుడే రిజల్ట్ మనకు తెలిసిపోతుంటుంది. మెంటల్ గా ముందు నుంచి ప్రిపేర్ అయిపోయింటాం కాబట్టి..డిజప్పాయింట్ మెంట్ అనేది ఉండదు. డిజప్పాయింట్ మెంట్ ఉంటేనా కదా..అనవసరంగా చేసామే అని రిగ్రెట్ అయ్యేది అన్నారు. నాగవల్లి త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ రకరకాల విషయాలు చర్చించారు.
ఇక నాగవల్లి గురించి చెబుతూ..అన్ని వర్గాలకు, తరగతులకు నచ్చే ఒక మంచి సినిమా 'నాగవల్లి". ఫస్ట్ కాపీ వచ్చాక మొన్న సినిమా చూసి నేనే ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా గురుకిరణ్ ఈ చిత్రానికి అందించిన నేపధ్యం సంగీతం సినిమాకు జీవం పోసింది. అనేక చోట్ల నా శరీరం రోమాంచితమయ్యింది. కన్నడ వెర్షన్ ను ఒకటి రెండు సార్లు చూసి, స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసేముందు ఒకటికి పదిసార్లు తర్జనభర్జన పడి, రోజుల తరబడి షూటింగ్ లో పాల్గొన్న నాకే అలా అనిపిస్తే, రేపు ఆడియన్స్ ఎంతటి థ్రిల్ కు లోనవుతారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. నాగవల్లి చిత్రంలో అనుష్క, రిచాగంగోపాధ్యాయ్, కమిలినీ ముఖర్జీ, పూనం కౌర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ నెల 16న చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











