వెంకీ, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్.... ఎఫ్2 ఫోటో షూట్ వీడియో!
Recommended Video

వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. స్టార్స్ అంతా షూటింగులో జాయిన్ అవ్వడంతో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రధాన తారాగణంపై ఇటీవల ఓ ఫోటో షూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
జోడీ అదిరిపోయింది
ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. వీరి జోడీ చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటో షూట్ చూసిన తర్వాత ఈ నలుగురు స్టార్లతో స్క్రీన్ మరింత అందంగా కనిపించడం ఖాయం అంటున్నారు.

వినోదాత్మకంగా
పూర్తి వినోదాత్మక చిత్రంగా 'ఎఫ్2: ఫన్ & ఫ్రస్టేషన్' మూవీ తెరకెక్కుతోంది. వెంకటేష్ గతంలో ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి స్టైల్లో పూర్తి ఫన్ రైడ్‌లా ఈ సినిమా సాగబోతోంది.

తమన్నా, మెహ్రీన్ గ్లామర్
ఈ సినిమాకు తమన్నా, మెహ్రీన్ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. హీరో హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు ప్లాన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

సినిమాపై భారీ అంచనాలు
అనిల్ రావిపూడి గత చిత్రాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ మంచి విజయాలు సాధించడం, హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో.... 'ఎఫ్2: ఫన్&ఫ్రస్టేషన్' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











