Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హిట్టు కొట్టాకే వెంకీకి ఆ డైరెక్టర్ గుర్తుకు వచ్చాడా!
వయసు పెరుగుతున్న సమయంలో విభిన్నకథలవైపు విక్టరీ వెంకటేష్ మొగ్గు చూపుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు స్వస్తి చెప్పి నటనకు ప్రాధాన్యత ఉన్న కథలని మాత్రమే ఒకే చేస్తున్నాడు. కథల ఎంపికలో నానా హైరానా పడిపోకుండా స్లో అండ్ స్టడీగా కథలని ఎంచుకుంటున్నాడు. గురు చిత్రంతో వెంకీ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ చిత్రం తరువాత వెంకటేష్ తేజతో ఓ సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.తాజగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ భాగమతి చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు అశోక్ తో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
భాగమతికి ముందు
అశోక్ భాగమతి కన్నా ముందు పిల్లజమీందార్, సుకుమారుడు వాంతి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల జమిందార్ చిత్రం పరవాలేదనిపించగా, సుకుమారుడు నిరాశ పరిచింది.
భాగమతితో సత్తా చాటాడు
కొంత గ్యాప్ తీసుకుని భాగమతి కథని ప్రిపేర్ చేసిన అశోక్ అనుష్క చేత ఒకే చెప్పించుకున్నాడు. భాగమతి విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అశోక్ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి.
దగ్గుబాటి కాంపౌండ్ నుంచి పిలుపు
అశోక్ భాగమతి కన్నా ముందు వెంకీకి ఓ కథని వినిపించాడట. కానీ వెంకీ రిజెక్ట్ చేసాడు. తాజాగా భాగమతితో హిట్టు కొట్టడంతో దగ్గుబాటి కాంపౌండ్ నుంచి అశోక్ పిలుపు అందుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకీతో సినిమా చేయడానికి సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. కానీ అశోక్ గతంలో వెంకీకి వినిపించిన కథతో సినిమా చేస్తాడా లేక కొత్త కథ ఏదైనా తయారు చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
తేజ కూడా ఉన్నాడు
దర్శకుడు తేజ కూడా వెంకీతో ఓ చిత్రం చేయాల్సి ఉంది. కానీ తేజ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం బిజీగా మారాడు. ఈ నెపథ్యంలో వెంకీ అశోక్ తో సినిమాని ముందుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.