పుష్కరం తర్వాత ఆ దర్శకుడితో వెంకీ
వెంకటేష్, సిమ్రన్ జంటగా దాదాపు పుష్కరం(12 ఏళ్ల) కిందట విడుదలైన 'కలిసుందాం రా" సినిమా గుర్తుందా?. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఆ సినిమాకు ఉదయ శంకర్ దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించారు. మరోసారి వెంకీతో పాటు దర్శక నిర్మాతల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వెంకీ ప్రస్తుతం తన రాబోయే సినిమా 'గంగా ది బాడీగార్డు" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అంగిస్తున్నారు.
More from Filmibeat
venkatesh uday shankar suresh productions suresh babu వెంకటేష్ ఉదయ శంకర్ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు


Click it and Unblock the Notifications











