twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం వింత టైటిల్ సామీ..!?: ఇంతకీ వెంకటెష్ కోసమేనా? లేక తరుణ్ భాస్కర్ కోసమా..??

    |

    Recommended Video

    Venky New Movie Title Funny Discussion ఇదేం వింత టైటిల్ వెంకీ..!

    సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రామానాయుడు మరణం తరువాత గురు సినిమా మాత్రమే చేసిన వెంకీ.. మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకొని తేజ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు.

    మూడు నాలుగు లైన్లో వున్నాయి

    మూడు నాలుగు లైన్లో వున్నాయి

    సురేశ్ ప్రొడక్షన్స్ .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులు మూడు నాలుగు లైన్లో వున్నాయి. వాటిలో ఒక సినిమా కోసం ' ఈ నగరానికి ఏమైంది'? అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.

    నేను రాజు నేనే మంత్రి

    నేను రాజు నేనే మంత్రి

    ఆల్రెడీ ఈ మాట జనంలో బాగా నానుతోన్న సంగతి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. రానా హీరో గా నేను రాజు నేనే మంత్రి లాంటి భారీ హిట్ సాధించిన తేజ మరోసారి అదే బ్యానర్ లో అదే ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు.

     ఆత్యాద్మిక యాత్రలు కూడా చేశాడట

    ఆత్యాద్మిక యాత్రలు కూడా చేశాడట

    చివరగా గురు సినిమాతో వచ్చిన వెంకీ చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు. ఈ మధ్యనే ఆత్యాద్మిక యాత్రలు కూడా చేశాడట. అయితే మొన్నటి వరకు వెంకీకి చాలా కథలు వచ్చాయి. ఏ సినిమాను పట్టాలెక్కించాలనే విషయం పై చాలా ఆలోచనలు జరిపి చివరగా తేజ చెప్పిన ఒక స్టోరీని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్దమయ్యాడు.

     ఈ నగరానికి ఏమైంది..?'

    ఈ నగరానికి ఏమైంది..?'

    నవంబర్ 16న మొదలు పెట్టి సినిమాను బ్రేక్ లేకుండా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. అయితే రీసెంట్ గా ఆ సినిమాకి ఒక టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫైనల్ చేశారన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో 'ఈ నగరానికి ఏమైంది..?' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

     ఆసక్తికర టైటిల్

    ఆసక్తికర టైటిల్

    దీంతో ఈ టైటిల్ వెంకీ, తేజ ల సినిమాకే అన్న ప్రచారం మొదలైంది. వెంకటేష్ సినిమాతోపాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ మరో సినిమాను కూడా నిర్మిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరి ఈ రెండింటిలో ఈ ఆసక్తికర టైటిల్ ఏ సినిమాకు ఫిక్స్ చేస్తారో మరి. ప్రతి సినిమాకి ముందు ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ తో వచ్చే యాడ్ గురించి అందరికి తెలిసిందే.

     సోషల్ మీడియాలో

    సోషల్ మీడియాలో

    సినిమాల్లో కూడా ఈ ఆ డైలాగ్స్ పై స్పూప్ లు చాలానే వస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి తేజ ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. వెంకీ సినిమా తర్వాత దర్శకుడు తేజ బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించనున్నాడు.

    వెంకీ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో

    వెంకీ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో

    వెంకీ రానాతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు. ఇదో రిమేక్ చిత్రమని చెబుతున్నారు. ఈ మూవీలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. వచ్చే నెల 16న ప్రారంభంకానున్న ఈ మూవీ లో నారా రోహిత్ విలన్ రోల్ చేయబోతున్నాడట. ఇక మిగతా కాస్ట్ & క్రూ వివరాలు తెలియాల్సి ఉంది.

    English summary
    As off now, the talk is that Venky's new Movie title, "Ee Nagaraniki Emayyindi" the popular smoking ad, that we see before the movie screenings at theatres as the title and official confirmation is yet awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X