వెంకటేష్ ఎవరూ దొరకనట్లు ఆ డైరక్టర్ తో ...
వెంకటేష్, దర్శకుడు తేజ ల కాంబినేషన్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి విడుదల అనంతరం ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. సావిత్రి టైటిల్ తో తయారయ్యే ఈ చిత్రం స్క్రిప్టుపై గత కొంత కాలంగా సురేష్ బాబు, తేజ కుస్తీపడుతున్నట్లు వినికిడి. ఇక తేజ కేక చిత్రం గుర్తు చేసుకున్న వెంకీ అభిమానులు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ఎవరూ దొరకనట్లు తేజతో సినిమా చేయటమేమిటని అంటున్నారు. అందులోనూ తేజ పెద్ద హీరోలను డీల్ చేయలేడని ట్రాక్ రికార్డు చెప్తున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెంకటేష్ ధైర్యమేనంటున్నారు. ఈ చిత్రం త్రివిక్రమ్ చిత్రంతో పాటు షూటింగ్ ప్రారంభం అవుతుంది. వెంకటేష్ తాజా చిత్రం "నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" ని డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.
వెంకటేష్ త్రిష తేజ కేక నమో వెంకటేశ శ్రీను వైట్ల venkatesh trisha teja keka namo venkatesa srinu vytla


Click it and Unblock the Notifications