త్వరలో వెంకటేష్ మెరుపు!

By Staff

Venkatesh
ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు తగ్గిపోయాయి. చిన్న సినిమాల జోరు పెరిగింది. హీరో వెంకటేష్‌ చింతకాయల రవి' తరువాత ఏ సినిమాలో నటిస్తున్నదీ ఇంతవరకూ ఖచ్చితంగా తెలియరాలేదు. హిందీలో ఘన విజయం సాధించిన వెడ్‌నెస్‌ డే' చిత్రం రీమేక్‌లో కమల్‌ హాసన్‌తో కలిసి నటిస్తున్నట్లు వినిపిస్తున్నప్పటికీ ఆయన స్వయంగా ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుతం రాష్ట్రం రాజకీయ వాతావరణంతో వేడెక్కిపోతుంటే ఎక్కువమంది హీరోలు షూటింగ్‌లకు స్వస్తి చెప్పి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడూ రాజకీయాలకు ఆమడ దూరంలో నిలిచే వెంకటేష్‌ ఈసారి కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఆయనకు రాజకీయాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదు. వెంకీ నటించబోయే తదుపరి చిత్రం ఎప్పుడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారికి త్వరలోనే తీపి కబురు అందనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X