twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ'వివేకానందుడు'త్వరలోనే...

    By Staff
    |

    ఆ మద్యన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వివేకానందుడు అనే చిత్రం రూపొందుతుందనే వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే అది కార్యరూపం దాల్చలేదు. పాండురంగడు అనంతరం రాఘవేంధ్రరావు ఈ పౌరాణిక చిత్రాల ట్రెండు ని కొనసాగిస్తారా లేదా అన్నది స్పష్టం చేయలేదు. ఈలోగా ఆయన రైట్ హ్యాండ్ రైటర్ జె.కె. భారవి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అవి కార్యరూపం కన్పించేటట్లు కనపడటం లేదు. అయితే ఈ సబ్జెక్టు పై వెంకటేష్ కి మమకారం తగ్గినట్లు కనపడటం లేదు.

    ఈ మధ్య చింతకాయల రవి ప్రెస్ మీట్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...తాన సోదరుడు సురేష్ బాబు సూచనల మేరకు వివేకానందుడు చేయనున్నానని వివరించారు. అయితే అది టెలీ-ఫిలిం అని తేల్చారు. అలాగే ఇలాంటి పాత్రలు చేయటం వల్ల తన ఇమేజ్ కేమీ భంగం కలగదని చెప్పుకొచ్చారు. అయితే ఈ టెలి ఫిలిం ను ఎవరు డైరక్ట్ చేయనున్నారనే సంగతి చెప్పలేదు. షూటింగ్ మాత్రం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కృష్ణం వందే జగద్గురం ప్రారంభానికి ముందే ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X