మరో రీమేక్ కు సిద్ధమైన వెంకటేష్?
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ వరుసగా రీమేక్ సీనిమాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే మళయాలం ‘దృశ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. మరో వైపు హిందీ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రం రీమేక్ ‘గోపాలా గోపాలా' లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారు. అంతకు ముందు వెంకీ చేసిన ‘మసాలా' చిత్రం కూడా హిందీ మూవీ ‘బోల్ బచ్చన్' రీమేకే కావడం గమనార్హం.
తాజాగా మరో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు వెంకటేష్. తాజా సమాచారం ప్రకారం ఆయన మరో రీమేక్ చిత్రానికి పచ్చజెండా ఊపారు. తమిళంలో విజయ్‌ఆంథోని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సలీమ్ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించబోతున్నట్లు తెలిసింది.

ఇందులో వెంకటేష్ కథానాయకుడిగా నటించబోతున్నట్లుగా సమాచారం. తమిళంలో ఎన్.వి.కుమార్ దర్శకత్వం వహించిన సలీమ్ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఈచిత్రం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications










