రెండు భాషల్లోనూ సూపర్ హిట్ మరి తెలుగు బాడీగార్డ్ రేంజ్ ఎంత...?
టాలీవుడ్ లో సంక్రాంతి పోరుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ముందుగా వెంకటేష్ బాడీగార్డ్ నిలుస్తుంది. వెంకటేష్ ఈసారి 'బాడీగార్డ్" చిత్రంతో మన ముందుకి రానున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా వచ్చిన బాడీగార్డ్ చిత్రానికి రిమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే సినిమా హిందీలో సల్మాన్ బాడీ గార్డ్ పేరుతోనే రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగులోనూ అదే పేరుతో రెడీ అయిపొయింది.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సలోని కీలక పాత్ర పోషిస్తుంది. సున్నితమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపన్న యువతిని కాపాడే బాడీగార్డ్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. తెలుగు బాడీగార్డ్ ను దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని అప్పుడే సల్మాన్ బాడీగార్డ్ రిలీజ్ కావడం, షూటింగ్ హడావుడిగా ముగించడం ఇష్టం లేక సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ గా మంచి జోష్ మీదున్న తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో డిసెంబరు 13న విడుదల కానుంది.
గతంలో ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలో రేమకే చేయగా రెండు భాషల్లోనూ భారీ విజయాలు సాధించాయి. సంక్రాంతికి విడుదల కానున్న బాడీగార్డ్ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











