twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ కి వెంకటేష్ కి లింక్

    By Srikanya
    |

    సినీ పరిశ్రమ లో నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగ ఓ కొత్త టాపిక్ సిని పరిశ్రమలో వినపడుతోంది. అది వెంకటేష్ షూటింగ్ జరుగుతున్న ఏ సెట్ కి వెళితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఈ టాక్ బయిటలుదేరటానికి కారణం...వెంకటేష్ ..దూకుడు టైమ్ లో మహేష్ ని దూకుడు సెట్స్ మీదకు వెళ్లి కలిసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కొద్ది రోజులు క్రితం గబ్బర్ సింగ్ సెట్ కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కలిసి ముచ్చటించాడు. ఆ సినిమా మెగా హిట్ అయ్యింది. ప్లాఫుల్లో ఉన్న ఇద్దరు హీరోలూ ఈ సినిమాలతో ఒడ్డున పడ్డారు.

    దాంతో వెంకటేష్ కాలు పెట్టిన సెట్ లో హీరో సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ మొదలైంది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ని ఈ విషయమై ప్రశ్నించింది. దానికి హరీష్ సమాధానమిస్తూ...నేనూ వింటున్నాను. ఓ సినిమా హిట్ అయ్యినప్పుడు అన్ని విషయాలూ కౌంట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి వెంకటేష్ బాబు సెట్స్ కి వచ్చారు. ఇద్దరూ ఆధ్యాత్మిక విషయాలు చాలా చర్చించారు. వెంకటేష్,పవన్ కళ్యాణ్ మంచి ప్రెండ్స్ అన్నారు.

    అయితే ఇది కేవలం కో ఇన్సిడెన్సే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇక ఈ సారి వెంకటేష్ ఎన్టీఆర్ సెట్స్ కు వెళ్ళతాడా అని మరికొందరు అంటున్నారు. అయితే కొద్ది మంది అంతలా వర్కవుట్ అవుతున్నప్పుడు తన అన్న కొడుకు రానా సెట్స్ మీదకు కూడా అప్పుడప్పుడూ వెళితే అతనికీ హిట్ వస్తుంది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేస్తున్నారు.

    ఆ చిత్రమే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో షాడో చిత్రం కూడా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టనర్ గా షాడో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో మెహర్ రమేష్ తాను పెద్ద హిట్ కొడతానని చెప్తున్నారు. అలాగే త్వరలో బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వంలో వివేకానంద చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాడీగార్డ్ ప్లాప్ కావటంతో ఆయన ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో చిత్రంపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.

    English summary
    Venkatesh has to make an appearance on the sets of a film for the movie to become a blockbuster. Venkatesh visited Mahesh Babu on the sets of "Dookudu" to catch up with the crew. Mahesh was going through a lean patch then with no hits in the last couple of years. The movie turned out to be a blockbuster. Again, Venky happened to drop in on the sets of Pawan Kalyan's latest release, which has got a great response from the BO, lending more credence to the speculation about Venkatesh's alleged ability to usher in lady luck.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X