వెంకటేష్ 'నారప్ప' లేటెస్ట్ అప్డేట్.. టీజర్ కోసం స్పెషల్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్ చాలా కాలం తరువాత మళ్ళీ నారప్ప షూటింగ్ తో బిజీ అయ్యాడు. అసలైతే పరిస్థితి అదువులోకి వచ్చే వరకు షూటింగ్స్ చేయవద్దని అనుకున్న వెంకటేష్ ధైర్యం చేసి నారప్ప షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా తెలివిగా సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. కరోనా ఎక్కువవుతున్న నేపథ్యంలో భారీ భద్రత నడుమ వెంకటేష్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే నారప్పకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే నిర్మాత సురేష్ బాబు టీజర్ రిలీజ్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ తుది దశలో ఉన్నట్లు సమాచారం.

లాక్ డౌన్ కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అప్పట్లో కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకు నారప్ప రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ్ లో 100కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











