For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎఫ్2' ప్రీమియర్ షో టాక్: వెంకీ, వరుణ్ ఫన్ కేక.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!

    |

    సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి రేపిన చిత్రం ఎఫ్2. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. వెంకీకి తోడుగా వరుణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి వీరిద్దరితో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 తెరకెక్కించారు. వెంకీ కామెడీ టైమింగ్ ని ఇష్టపడేవారు ఈ చిత్రం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎఫ్2 నేడు విడుదల కాబోతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలో పూర్తయ్యాయి. ఈచిత్రానికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం!

    కామెడీనే బలంగా

    కామెడీనే బలంగా

    దర్శకుడు అనిల్ రావిపూడి యూరప్ లో వచ్చే సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించాడు. ట్రైలర్ లో చూపించా విధంగా నటుడు నాజర్, వెంకీ, వరుణ్ మధ్య ఫన్నీ సన్నివేశాలతో చిత్రం ప్రారంభం అవుతుంది. వెంకీ, వరుణ్ తమ కథని ఫ్లాష్ బ్యాక్ రూపంలో నాజర్ కు వివరిస్తారు. సినిమా మొత్తం కామెడీనే ప్రధాన బలంగా సాగుతుంది. వెంకీ, వరుణ్ కలసి చేసే రచ్చకు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా జాయిన్ అవుతారు.

     ఫస్ట్ హాఫ్ కేక

    ఫస్ట్ హాఫ్ కేక

    ఎఫ్2 ఫస్ట్ హాఫ్ కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ముందుగా అనుకున్నట్లుగానే వెంకీ తన కామెడీ టైమింగ్ తో అదరగొడ్డాడు. వరుణ్ తేజ్ కూడా మెప్పించాడు. దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో కథని చెప్పుకున్నా ఎక్కడా బోర్ కొట్టించలేదు. వెంకీ నటించే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. సరదాగా సాగిన ఫస్ట్ హాఫ్ లో మంచి ట్విస్ట్ ఇంటెర్వెల్ పడుతుంది.

    సాగదీసినట్లుగా

    సాగదీసినట్లుగా

    ఫస్ట్ హాఫ్ లో సాగిన కామెడీ జోరు సెకండ్ హాఫ్ లో కొనసాగలేదు. సాగదీసిన సన్నివేశాలు, బలవంతమైన కామెడీ సెకండ్ హాఫ్ లో మైనస్ గా మారింది. కానీ వెంకీ, వరుణ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. దర్శకుడు కేవలం కామెడీపైనే దృష్టిపెట్టాడు. చెప్పుకోదగ్గ కథ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫన్ లవర్స్ కు కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రం ద్వారా లభిస్తుందని చెప్పొచ్చు.

     దేవిశ్రీ సంగీతం

    దేవిశ్రీ సంగీతం

    తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కూడా ఈ చిత్రాన్ని ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక సంగీతం విషయానికి వస్తే ఒకటి రెండు పాటలు మినహా మిగిలినవి ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ సంగీతంలో కూడా దేవిశ్రీ తన మ్యాజిక్ చూపించలేక పోయాడు. ఓవరాల్ గా అయితే ఈ చిత్రానికి యూఎస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే చిత్రం కావడంతో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie premier show talk and highlights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X