వెంకటేష్ వరుణ్ తేజ్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
పటాస్, సుప్రీం లాంటి సీరియల్ హిట్స్ తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్స్ జాబితాలో చేరిన అనిల్ రావిపూడి కొత్త సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు ఎఫ్ 2అనే టైటిల్ ను పెట్టడం జరిగింది.
మాస్ ఎలెమెంట్స్ మిస్ చేయకుండా కథలను నడిపించడంలో పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన మూడు సినిమాలను మంచి వినోదంతో నడిపించాడు.అదే తరహాలో ఈ సినిమా కామిడి ఎంటర్టైనర్ గా ఉండబోతోందని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా మే రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో వెంకటేష్ కు ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అనసూయ ఈ మూవీలో మంచి పాత్రలో కనిపించబోతోంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ ఈ సినిమలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











